Yese naa Parihaari - యేసే నా పరిహారి
యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ||యేసే నా||
1. ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో ||2||
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ||యేసే నా||
2. నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా ||2||
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ||యేసే నా||
3. మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా ||2||
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ||యేసే నా||
4. బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా ||2||
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ||యేసే నా||
5. దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ ||2||
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను ||2|| ||యేసే నా||
Create Your Own Website With Webador