Yesayyaa Naa Hrudayaabhilaasha - యేసయ్యా నా హృదయాభిలాష

 

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా  ||2||

 

1. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు  ||2||
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||

 

2. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా  ||2||
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||