Yesayya Naa Hrudaya Spandana - యేసయ్యా నా హృదయ స్పందన
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా ||2||
విశ్వమంతా నీ నామము ఘణనీయము ||2|| ||యేసయ్యా||
1. నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే ||2||
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే ||2||
యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే ||2||
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||2||
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3. నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే ||2||
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే ||2||
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
Create Your Own Website With Webador