Yesayya Kanikarapoornuda - యేసయ్యా కనికరపూర్ణుడా
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా ||2||
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము ||2|| ||యేసయ్యా||
1. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి ||2||
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే ||2|| ||యేసయ్యా||
2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ||2||
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము ||2|| ||యేసయ్యా||
3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు ||2||
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు ||2|| ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ||4||
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ||4||
Create Your Own Website With Webador