Yehovaa Naa Balama - యెహోవా నా బలమా



యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం ||2||                  ||యెహోవా||

1. నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ ||2||
వరదవలె భక్తిహీనులు పొర్లిన ||2||
విడువక నను ఎడబాయని దేవా ||2||         ||యెహోవా||

2. మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై ||2||
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ||2||
ఆదరెను ధరణి భయకంపముచే ||2||         ||యెహోవా||

3. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును ||2||
జలరాసులనుండి బలమైన చేతితో ||2||
వెలుపల చేర్చిన బలమైన దేవుడు ||2||     ||యెహోవా||

4. పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను ||2||
తన నోటనుండి వచ్చిన అగ్ని ||2||
దహించివేసెను వైరులనెల్లన్ ||2||             ||యెహోవా||

5. మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును ||2||
ఉరుముల మెరుపుల మెండుగ జేసి ||2||
అపజయమిచ్చును అపవాదికిని ||2||       ||యెహోవా||

6. దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును ||2||
గర్విష్టుల యొక్క గర్వమునణుచును ||2||
సర్వమునెరిగిన సర్వాధికారి ||2||             ||యెహోవా||

7. నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి ||2||
రక్షణ కేడెము నాకందించి ||2||
అక్షయముగ తన పక్షము జేర్చిన ||2||     ||యెహోవా||

8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే ||2||
అన్యజనులలో ధన్యత చూపుచు ||2||
హల్లెలూయ స్తుతిగానము చేసెద ||2||       ||యెహోవా||

Create Your Own Website With Webador