Vijaya geethamu manasaara - విజయ గీతము మనసార

విజయ గీతము మనసార నేను పాడెద

నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||

పునరుత్తానుడ నీవే

నా ఆలాపన నీకే నా ఆరాధన ||2||

1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే

పుటము వేసితివే నీ రూపము చూడ నాలో ||2||

యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది

నీ ఉత్తమమైన సంఘములో ||2||                    ||విజయ||

2. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి

నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ||2||

యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము

నీ పరిశుద్ధులలో చూపినది ||2||                    ||విజయ||

3. నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు

నిరక్షణయే రగులుచున్నది నాలో ||2||

యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె

నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2||                    ||విజయ||

Create Your Own Website With Webador