Sthuthi paathruda - స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా ||2||
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు ||2|| ||స్తుతి||
1. నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు ||2||
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు ||2|| ||స్తుతి||
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ ||2||
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో ||2|| ||స్తుతి||
Create Your Own Website With Webador