Sthuthi Simhaasanaaseenudavu - స్తుతి సింహాసనాసీనుడవు
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా - దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా - నీదు రూపును వర్ణించలేనయ్యా ||2||
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
1. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా ||2||
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో ||2||
నీ తోడు నే కోరితి ||2||
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా ||4||
2. పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి ||2||
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ ||2||
నీ సిలువ నే కోరితి ||2||
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా ||4||
Create Your Own Website With Webador