Sthothram Chellinthumu - స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
1. దివారాత్రములు కంటిపాపవలె కాచి ||2||
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి ||2|| ||స్తోత్రం||
2. గాడాంధకారములో కన్నీటి లోయలలో ||2||
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి ||2|| ||స్తోత్రం||
3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి ||2||
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి ||2|| ||స్తోత్రం||
4. సీయోను మార్గములో పలుశోధనలు రాగా ||2||
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి ||2|| ||స్తోత్రం||
5. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ||2||
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి ||2|| ||స్తోత్రం||
6. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా ||2||
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా ||2|| ||స్తోత్రం||
Create Your Own Website With Webador