Sreemanthudaa Yesayya - శ్రీమంతుడా యేసయ్యా

శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా  ||2||

1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా    ||2||
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా    
ఇదియే నీ త్యాగ సంకేతమా    ||2||    || శ్రీమంతుడా ||

2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున      ||2||
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా    ||2||  || శ్రీమంతుడా ||

3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము    ||2||
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా    ||2||  || శ్రీమంతుడా ||

Create Your Own Website With Webador