Siyonu Paatalu Santhoshamugaa - సీయోను పాటలు సంతోషముగా

సీయోను పాటలు సంతోషముగా

పాడుచు సీయోను వెల్లుదము    ||2||

 

1. లోకాన శాశ్వతానందమేమియు

లేదని చెప్పెను ప్రియుడేసు    ||2||

పొందవలె నీ లోకమునందు

కొంతకాలమెన్నో శ్రమలు    ||2|| ||సీయోను||

 

2. ఐగుప్తును విడచినట్టి మీరు

అరణ్యవాసులే ధరలో    ||2||

నిత్యనివాసము లేదిలలోన

నేత్రాలు కానానుపై నిల్పుడి    ||2|| ||సీయోను||

 

3. మారాను పోలిన చేదైన స్థలముల

ద్వారా పోవలసియున్ననేమి    ||2||

నీ రక్షకుండగు యేసే నడుపును

మారని తనదు మాట నమ్ము    ||2|| ||సీయోను||

 

4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి

రంగుగ యేసుని వెంబడించి    ||2||

పాడైన కోరహు పాపంబుమాని

విధేయులై విరాజిల్లుడి    ||2|| ||సీయోను||

 

5. ఆనందమయ పరలోకంబు మనది

అక్కడనుండి వచ్చునేసు    ||2||

సీయోను గీతము సొంపుగ కలసి

పాడెదము ప్రభుయేసుకు జై    ||2|| ||సీయోను||