Shaaronu polamulo poosina - షారోను పొలములో పూసిన

షారోను పొలములో పూసిన పుష్పమా

అగాధ లోయలో దాగిన పద్మమా    ||2||

ప్రియ సంఘమాప్రియ సంఘమా    ||2|| ||షారోను||

1.ఆనందభరితం నీ హృదయం

నీ ప్రేమ అపారము    ||2||

యేసు నాథుడు నిన్ను పిలువగా   ||2||

సిద్ధపడుమా సంఘమా

సంఘమా నా సంఘమా    ||2|| ||షారోను||

2.కొండలు దాటి బండలు దాటి

యేసు నాథుడు నిను చేరగా    ||2||

నీదు హృదయమున నివసింపనీయుమా   ||2||

సిద్ధపడుమా సంఘమా

సంఘమా నా సంఘమా    ||2|| ||షారోను||

3.మేఘములపై యేసు నాథుడు

నిన్ను పిలువా ఏతెంచగా   ||2||

రెప్పపాటునా ప్రభుని చేరగా    ||2||

సిద్ధపడుమా సంఘమా

సంఘమా నా సంఘమా    ||2|| ||షారోను||

Create Your Own Website With Webador