Saswatha Krupanu - శాశ్వత కృపను
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో ||2|| ||శాశ్వత||
1. నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది ||2||
నా దేహమెంతో నీకై ఆశించే ||2|| ||శాశ్వత||
2. దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే ||2||
ధూపార్తిని చేపట్టి చేసెద ||2|| ||శాశ్వత||
3. భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట ||2||
వేయిదినాల కంటే శ్రేష్టమైనది ||2|| ||శాశ్వత||
4. సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద ||2||
సీయోను రారాజువు నీవేగా ||2|| ||శాశ్వత||
5. నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే ||2||
నూతన సృష్టిగా నన్ను మార్చెను ||2|| ||శాశ్వత||
Create Your Own Website With Webador