Sarvonathuda Neeve Naku - సర్వోన్నతుడా నీవే నాకు

సర్వోన్నతుడా

నీవే నాకు ఆశ్రయదుర్గము   ||2||

ఎవ్వరులేరు - నాకు ఇలలో   ||2||

ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా   ||2||

 

1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట

నిలువలేరని యెహోషువాతో   ||2||

వాగ్దానము చేసినావు

వాగ్దానా భూమిలో చేర్చినావు   ||2||   సర్వో

 

2. నిందలపాలై నిత్య నిబంధన

నీతో చేసిన దానియేలుకు   ||2||

సింహాసనమిచ్చినావు

సింహాల నోళ్లను మూసినావు   ||2||   సర్వో

 

3. నీతి కిరీటం దర్శనముగా

దర్శించిన పరిశుద్ధ పౌలుకు   ||2||

విశ్వాసము కాచినావు

జయజీవితము నిచ్చినావు   ||2|| సర్వో

 

Create Your Own Website With Webador