Raajadhi Raaja - రాజాధి రాజ
రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రజ్య పరిపాలక
విడువని కృప నాలో స్దాపించెనే
సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును
1. వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి ||2||
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెద ||2|| ||రాజాధి||
2. ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరచి ||2||
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరణిలో ||2|| ||రాజాధి||
3. మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి ||2||
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే ||2|| ||రాజాధి||
Create Your Own Website With Webador