Raaja Nee Sannidhilone - రాజా నీ సన్నిధిలోనే

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య ||2||

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ||2||

నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య ||2||

1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం

ఆరాధించుకొనే విలువైన అవకాశం   ||2||

కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును ||2||

బాధల నుండి బ్రతికించుటకును

నీవే రాకపోతే నేనేమైపోదునో ||2|| ||నేనుండ||

2. ఒంటరి పోరు నన్ను విసిగించిన

మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా

ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ||2|| ||నేనుండ||

3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా

దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా  ||2||

విశ్వానికి కర్త నీవే నా గమ్యము

నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము

నిన్ను మించిన దేవుడే లేడయ్య ||2|| ||నేనుండ||

 

Create Your Own Website With Webador