Priya Yesu Rajunu - ప్రియ యేసు రాజును



ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటేమేలు ||2||
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు. ||2||

1. యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి.     ||2||
నిష్కళంక పరిశుద్ధులతో పోదున్‌ నేను    ||2||
బంగారు వీదులలో తిరిగెదన్‌       ||2||     ||ప్రియ||

2. దూతలు వీణలను మీటునపుడు
గంభీర జయద్వనులు మ్రోగినపుడు.    ||2||
హల్లెలూయ పాటల్‌ పాడుచుండ    ||2||
ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్‌       ||2||    ||ప్రియ||

3.ముండ్ల మకుటంబైన తలనుజూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్‌.    ||2||
కొరడలతో కొట్టబడిన వీపునుజూచి    ||2||
ప్రతి యెక్క గాయమును చుంబింతును    ||2||    ||ప్రియ||

4.హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించు చుంటె    ||2||
హల్లెలూయ…..ఆమేన్‌,హల్లేలూయా..    ||2||
వర్ణింప నా నాలుకచాలదయ్యా     ||2||    ||ప్రియ||

5.
ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో
ఆహా ! నా ఆశ యెపుడు తీరుతుందో.    ||2||
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో    ||2||
ఆశతో వేచియుండె నా హృదయము    ||2|    ||ప్రియ||

 

 

Create Your Own Website With Webador