Premaa poornudu - ప్రేమా పూర్ణుడు

 

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను ||2||
నే పాడెదన్ – కొనియాడెదన్ ||3||
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ||4||      ||ప్రేమా||

 

1. లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ ||2||
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా ||2||
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ ||2||      ||ప్రేమా||

 

2. మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ ||2||
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే ||2||
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ ||2||    ||ప్రేమా||

 

Create Your Own Website With Webador