Paadedha Sthuthi Gaanamu - పాడెద స్తుతి గానము

పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము ||2||
నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం
అతి శ్రేష్టుడా నా యేసయ్య ||2|| ||పాడెద||

1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు ||2||
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను ||2||
నీ అనుబంధము నాకు ఆనందమే ||2|| ||పాడెద||

2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే ||2||
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను ||2||
నీ అభిషేకము పరమానందమే ||2|| ||పాడెద||

3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి ||2||
యూదా గోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహాసమే ||2||
నీ పరిచర్యలో మహిమానందమే ||2|| ||పాడెద||