Nuthana geethamu - నూతన గీతము
నూతన గీతము నే పాడెదా
మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను
నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే -
సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు
కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా
నీకు సాటెవ్వరూ ||2||
నీవే నా ప్రాణము
నిను వీడి నేనుండలేను ||2|| ||నూతన||
2. కడలి తీరం కనబడనివేళ
కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా
నీకు సాటెవ్వరూ ||2||
నీవేనా ధైర్యమూ
నీ కృపయే ఆధారమూ ||2|| ||నూతన||
3. మేఘములలో నీటిని దాచి
సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన
నీకు సాటెవ్వరూ ||2||
నీవేనా విజయమూ
నీ మహిమయే నా గమ్యమూ ||2|| ||నూతన||
Create Your Own Website With Webador