Nithyuda Nee Sannidi - నిత్యుడా నీ సన్నిధి

నిత్యుడా - నీ సన్నిధి

నిండుగా నా తోడూ

నిత్యముంచి నన్ను

నడిపించుమా - నడిపించుమా ||2||

1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది

నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది ||2||

నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా ||2||         ||నిత్యుడా||

2. నీ సన్నిధిలో - నా హృదయమును

నీళ్ళవలే - కుమ్మరించునట్లు ||2||

నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా ||2||       ||నిత్యుడా||

3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె

నీ మనస్సు నందు - నన్ను తలంచితివా ||2||

నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా ||2||               ||నిత్యుడా||