Nirantham Neethone Jeevinchaalane - నిరంతరం నీతోనే జీవించాలనే

 

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది ||2||
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||

1. చీకటిలో నేనున్నప్పుడు

నీ వెలుగు నాపై ఉదయించెను ||2||

నీలోనే నేను వెలగాలని

నీ మహిమ నాలో నిలవాలని ||2||

పరిశుద్ధాత్మ అభిషేకముతో

నన్ను నింపుచున్నావు - నీరాకడకై     || నిరంతరం ||

 

2. నీ రూపము నేను కోల్పోయినా

నీ రక్తముతో కడిగితివి ||2||

నీతోనే నేను నడవాలని

నీ వలెనే నేను మారాలని ||2||

పరిశుద్ధాత్మ వరములతో

అలంకరించుచున్నావు - నీరాకడకై     ||నిరంతరం||

3. తొలకరి వర్షపు జల్లులలో

నీ పొలములోనే నాటితివి ||2||

నీలోనే చిగురించాలని

నీలోనే పుష్పించాలని ||2||

పరిశుద్ధాత్మ వర్షముతో

సిద్ద పరచుచున్నావు - నీరాకడకై    ||నిరంతరం||