Nenu Velle Maargamu - నేను వెళ్ళే మార్గము

 

నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును

శోధించబడిన మీదట
నేను సువర్ణమై మారెదను ||2|| ||నేను||

 

1. కడలేని కడలి తీరము
ఎడమాయె కడకు నా బ్రతుకున ||2||

గురిలేని తరుణాన వెరువగ
నా దరినే నిలిచేవ నా ప్రభు ||2||

హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌ ||2||  ||నేను||

 

2. జలములలోబడి నే వెళ్లినా
అవి నా మీద పారవు ||2||

అగ్నిలో నేను నడచినా
జ్వాలలు నను కాల్చజాలవు ||2||
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌ ||2||  ||నేను||

 

3. విశ్వాస నావ సాగుచు
పయనించు సమయాన నా ప్రభు ||2||

సాతాను సుడిగాలి రేపగా
నా యెదుటే నిలిచేవా నా ప్రభు ||2||
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌ ||2|| ||నేను||