Nenendukani Nee Soththugaa - నేనెందుకని నీ సొత్తుగా
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున ||2||
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ ||2||
1. నీ పరిచర్యను తుదముట్టించుటే
నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే ||2||
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
ఏమని వివరింతును ||2|| ||నేనె||
2. నీ శ్రమలలో – పాలొందుటయే
నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
ఏమని వివరింతును ||2|| ||నేనె||
3. నీలో నేనుండుటే – నాలో నీవుండుటే
నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద ||2||
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
ఏమని వివరింతును ||2|| ||నేనె||
Create Your Own Website With Webador