Nenemaina Prabhuva - నేనేమైనా ప్రభువా

 

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను ||2||
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా ||2||
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా ||2|| ||నేనేమైనా||

1. లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ||2||
ఇచ్చిన నీవే బలి కోరగా ||2||
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||

2. సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా ||2||
ఆప్తులంతా శత్రువులైనా ||2||
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||

3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే ||2||
ఇదిగో నేను ఉన్నానయ్యా ||2||
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||