Nenaithe nee Mandiramandu - నేనైతే నీ మందిరమందు

 

నేనైతే నీ మందిరమందు
హల్లెలూయా స్తుతి నే పాడుచు
పచ్చని ఒలీవనై వుందును ||2||

1. ఈ నూతన సంవత్సరమున
నన్ను నిలిపిన యేసయ్య స్తోత్రములు ||2||
నాపై నీకున్న ప్రేమను చూపితివే ||2||
కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవించెద ||2||

2. నీ కృపవెంబడి కృపను పొందుచు
నీ పాదాల కడవదిగి ఉండెదను ||2||
నీపై నాకున్న ప్రేమను తలపోయుచు ||2||
నా మదిలో నిన్నే నిలిపి పూజింతును ||2||

3. నీ ఆశ్చర్యకార్యములు ధ్యానించుచు
నేను ధైర్యముగా నీకొరకు జీవించెద ||2||
నీకై శ్రమపడుట నాకు ఎంతో మేలాయెను ||2||
నాకై నీవిచ్చే బహుమతిపై గురి నిలిపేదా ||2||