Neevunte naaku chaalu Yesayya - నీవుంటే నాకు చాలు యేసయ్యా

 

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా ||2||
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2|| ||నీవుంటే||

 

1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||2|| ||నీ మాట||

 

2. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా ||2|| ||నీ మాట||

 

3. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ||2|| ||నీ మాట||

 

4. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము ||2|| ||నీ మాట||