Neetho Naa Jeevitham - నీతో నా జీవితం
నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబంధం మాధుర్యమే ||2||
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే
1. భీకర ధ్వనిగలా మార్గమునందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు ||2||
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం ||2|| ||ఆరాధ్యుడా||
2. సంతోషమందైనా శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే ||2||
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు ||2|| ||ఆరాధ్యుడా||
3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ||2||
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు ||2|| ||నీతో నా||
Create Your Own Website With Webador