Nee Premakai Vandanam Yesayya - నీ ప్రేమకై వందనం యేసయ్య
నీ ప్రేమకై వందనం యేసయ్య
నీ కృపలకై వందనంయేసయ్య
పాపినైనా నన్ను ఎంతో ప్రేమించావు
నీ రక్తముతో కడిగి నన్ను క్షమియించావు
ఆశ్చర్యకారుడా ఆలోచనాకర్త బలవంతుడా
నిత్యుడగుతండ్రి సమాధానకర్త
1. ఈ లోకంలో నాకు ఆదరణలేనప్పుడు
ఆదరించింది నీ ప్రేమయేకదా ||2||
తండ్రివి నీవే - తల్లివి నీవే
ఆదియు నీవే - అంతము నీవే ||2||
2. శాంతిసమాధానము నా యందు లేనపుడు
నీ వాక్యమే నాకు - శాంతినిచ్ఛేగా ||2||
నీవే మార్గము - నీవే సత్యము
నీవే జీవము - నీవే సర్వము ||2||
3. నేను వేళ్ళు మార్గములో - నేను చేయు పనులలో
తోడునీడగా ఉన్నది - నీవేగదా ||2||
హల్లేలూయాని - ఆరాధించెదం
నీ సన్నిధిలో - సంతోషమే ||2||
4. మా నిస్సి సంఘములో - దినదినం అభివృద్ధి
ఆయురారోగ్యములతో - దీవించు యేసయ్య ||2||
బలవంతుడా - అభిషక్తుడా
ఆదిసంభూతుడా - నా యేసయ్య ||2||
Create Your Own Website With Webador