Nee Needalo nannu dhaachumu - నీ నీడలో నన్ను దాచుము
నీ నీడలో నన్ను దాచుము
నీ జాడలో సాగి పోదును ||2||
1. గాయాలు చాలయే కడుగుము దేవా
ఆయాసమును తీర్చు నీ సన్నిధి ||2||
నా యాత్రలో నీవే నా సారధి
నా ఆత్మ నీయందే హర్షించును. ||2|| ||నీ నీడలో||
2. చేదోడు వాదోడు నీవేగా
పాదాల దరి చేరితి యేసయ్య ||2||
నీ దాపు చేరిన మరణంబు లేదయ్య
ఆధారం నీవేగా యేసయ్య. ||2|| ||నీ నీడలో||
3. నీ పూల మొక్కను నీ కాంతి కిరణం
నాలో పడి నేడే వికసింతును ||2||
భూలోకమునందు పుష్పించి
నీ దయ వేలాది వాసనలు వెదజల్లుదున్ ||2|| ||నీ నీడలో||
Create Your Own Website With Webador