Nee Krupa Nithyamundunu - నీ కృప నిత్యముండును

 

నీ కృప నిత్యముండును

నీ కృప నిత్య జీవము

నీ కృప వివరింప నా తరమా యేసయ్యా ||2||

నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది

రక్షణ సంగీత సునాదము ||2||        ||నీ కృప||

 

1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె

కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు ||2||

కృంగిన వేళలో నను లేవనెత్తిన

చిరునామా నీవేగా ||2||        ||నీ కృప||

 

2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె

ప్రతి క్షణమున నీవు పలుకరించావు ||2||

ప్రతికూలమైన పరిస్థితిలన్నియు

కనుమరుగైపోయెనే ||2||        ||నీ కృప||

 

3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె

నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు ||2||

రాజమార్గములో నను నడుపుచున్న

రారాజువు నీవేగా ||2||        ||నీ కృప||

 

Create Your Own Website With Webador