Nee Krupa Chethane - నీ కృప చేతనే

 

నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా

ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం

 

1. నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి        

నా కన్న తండ్రికన్నా భారము భరించితివి||2||

శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు      

ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి

ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను

ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం  ||2||

నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా

 

2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా

నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా||2||

నను విసిరేయక సారెపై ఉంచితివి

కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు

నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా                                                          

ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం  ||2||     

నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా

 

3. ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక       

పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి||2||

గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా

పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో

రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా

ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం ||2||        

నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా

 

Create Your Own Website With Webador