Nee Jaldharu Vrukshapu Needalalo - నీ జల్దరు వృక్షపు నీడలలో

 

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని ||2||
బలు రక్కసి వృక్షపు గాయములు ||2||
ప్రేమా హస్తములతో తాకు ప్రభు ||2||     ||నీ జల్దరు||

1. నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి ||2||
నీ శిరము వానకు తడిచినను ||2||
నను రక్షించుటకు వేచితివి ||2||    ||నీ జల్దరు||

2. ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా ||2||
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి ||2||
నీ సొగసును నాకు నొసగితివి ||2||      ||నీ జల్దరు||

3. నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి ||2||
ద్రాక్షా రస ధారల కన్న మరి ||2||
నీ ప్రేమే ఎంతో అతి మధురం ||2||     ||నీ జల్దరు||

4. ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు ||2||
నా హృదయపు తలుపులు తెరచుకొని ||2||
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను  ||2||     ||నీ జల్దరు||

5. నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి ||2||
జీవాహారము నా కందించి ||2||
పరమా గీతములను నేర్పితి  ||2||     ||నీ జల్దరు||