Nazareyuda Naa Yesayya - నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి ||2||
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య ||2||
నీకే వందనం నీకే వందనం ||2|| ||నజరేయుడా||
2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ||2||
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా ||2||
నీకే వందనం నీకే వందనం ||2|| ||నజరేయుడా||
3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా ||2||
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా ||2||
నీకే వందనం నీకే వందనం ||2|| ||నజరేయుడా||
Create Your Own Website With Webador