Nammakamaina Naa Prabhu - నమ్మకమైన నా ప్రభు

 

నమ్మకమైన నా ప్రభు

నిన్ను నే స్తుతింతును

నిన్ను నే స్తుతింతును    || నమ్మకమైన ||

1. కరుణతోడ పిల్చియు

స్థిరపరచి కాపాడిన

స్థిరపరచి కాపాడిన

స్థిరపరచిన నా ప్రభున్

పొగడి నే స్తుతింతును ||2||        || నమ్మకమైన ||

2. ఎన్నో సార్లు నీ కృపన్

విడచియుంటినో ప్రభు

విడచియుంటినో ప్రభు

మన్ననతోడ నీ దరిన్

చేర్చి నన్ క్షమించితివి ||2||       || నమ్మకమైన ||

3. కృంగియుండు వేళలో

పైకి లేవనెత్తితివి

పైకి లేవనెత్తితివి

భంగ పర్చు సైతానున్

గెల్చి విజయమిచ్చితివి ||2||        || నమ్మకమైన ||

4. నా కాశ్రయశైలమై

కోటగా నీవుంటివి

కోటగా నీవుంటివి

ప్రాకారంపు ఇంటివై

నన్ను దాచియుంటివి ||2||          || నమ్మకమైన ||

5. సత్య సాక్షివై యుండి

నమ్మదగినవాడవై

నమ్మదగినవాడవై

నిత్యుడౌ మా దేవుడా

ఆమేనంచు పాడెద ||2||            || నమ్మకమైన ||

 

Create Your Own Website With Webador