Nammakamaina Devudavaina - నమ్మకమైన దేవుడవైన

నమ్మకమైన దేవుడవైన

నీవే చాలు యేసయ్యా ||2||

నేనేమైయున్నా స్థితిలో ఉన్నా ||2||

ఇంకేమి కోరుకోనయ్యా ||2|| ||నమ్మకమైన||

 

1. ఆప్తులైన వారే హాని చేయచూసినా

మిత్రులే నిలువకుండినా ||2||

న్యాయము తీర్చే నీవు నాకుంటే ||2||

చాలు యేసయ్యా ||2||     ||నమ్మకమైన||

 

 

2. జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా

నష్టమే మిగులుచుండినా ||2||

శాపము బాపే నీవు నాకుంటే ||2||

చాలు యేసయ్యా ||2||     ||నమ్మకమైన||

 

3. కష్ట కాలమందు గుండె జారిపోయినా

గమ్యమే తెలియకుండినా ||2||

సాయము చేసే నీవు నాకుంటే ||2||

చాలు యేసయ్యా ||2||     ||నమ్మకమైన||

Create Your Own Website With Webador