Nammadagina Vaadavu Sahaayudavu - నమ్మదగిన వాడవు సహయుడవు

నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య

ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య   ||2||

చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి

నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును ||2||  || నమ్మదగిన ||

 

1. నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే

శత్రువుల కోటలన్ని కూలిపోయెను

సంకేళ్ళు సంబరాలు  ముగబోయెను ||2||

నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు

నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను ||2||  || నమ్మదగిన ||

2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి

జఠిలమైన త్రోవలన్ని దాటించితివి

సమృద్ధి జీవముతో పోషించితివి ||2||

ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా

నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను ||2||  || నమ్మదగిన ||

3. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి

యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి

అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి ||2||

ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి

సర్వోత్తమమైన మార్గములో నడిపించుము ||2||  || నమ్మదగిన ||