Naalo Nivasinche Naa Yesayya - నాలో నివసించే నా యేసయ్య

నాలో నివసించే నా యేసయ్య

మనోహర సంపద నీవేనయ్యా ||2||

మారని మమతల మహనీయుడ ||2||

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా -

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా ||2||   ||నాలో నివసించే||

1. మధురమైనది నీ స్నేహబంధం

మహిమగా నన్ను మార్చిన వైనం ||2||

నీ చూపులే నన్ను కాచెను

నీ బాహువే నన్ను మోసేను ||2||

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2||       ||కీర్తించి||

2. వినయ భావము ఘనతకు మూలము

నూతన జీవములో నడుపు మార్గం ||2||

నా విన్నపం విన్నవులే

అరుదేంచేనే నీ వరములే ||2||

ఏమని వర్ణింతును నీ కృపలను ||2||         ||కీర్తించి||

3. మహిమ గలది నీ దివ్య రాజ్యం

తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2||

సియోనులో చేరాలనే

నా ఆశయం నెరవేర్చుము ||2||

యేసయ్య నిన్ను చూచి హర్షింతును

 

భువినేలు రాజ నీకే నా వందనం

దివినేలు రాజ వేలాది వందనం ||2||    ||నాలో నివసించే||

Create Your Own Website With Webador