Naaku Nee Krupa Chaalunu - నాకు నీ కృప చాలును

నాకు నీ కృప చాలును ప్రియుడా

నాకు నీ కృప చాలును    ||2||

శ్రమలతో నిండిన జీవితములో    ||2||

1. జతలేని పావురము వలెనే

మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు    ||2||

నాధా నీ రాకా ఆలస్యమైతే    ||2||

పడకుండా నిలబెట్టుము - నన్ను జారకుండా కాపాడును    ||2||

2. సింహపు బోనులో నన్ను వేసినను

అగ్ని మధ్యలో పడవేసినను    ||2||

హృదయము కలవరపడు సమయములో    ||2||

పడకుండా నిలబెట్టుము - నన్ను జారకుండా కాపాడును    ||2||

3. ఒక మనుష్యుడు లేడు ఆశ్రయించుటకు

ఆదరణ పొందుటకు స్థలము లేదు    ||2||

సంపూర్ణ జీవము కలిగిన నాధా    ||2||

నీవే నా ఆదరణ - భువిలో నీవే నా ఆధారము    ||2||

Create Your Own Website With Webador