Naakenno Melulu - నాకెన్నో మేలులు
నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును
దేవా నీకేమి అర్పింతును ||2||
హల్లెలూయా యేసునాథా
కృతజ్ఞతా స్తుతులివే ||2|| ||నాకెన్నో||
1. కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే ||2|| ||హల్లెలూయా||
2. నా జీవితాశలు ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే ||2|| ||హల్లెలూయా||
3. నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే ||2|| ||హల్లెలూయా||
4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు ||2|| ||హల్లెలూయా||
Create Your Own Website With Webador