Naa Yesayya Naa Sthuthiyaagamu - నా యేసయ్యా నా స్తుతియాగము

 

నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే ||2||

1. ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు ||2||
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా ||2||
విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా||

2. ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు ||2||
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా ||2||
మరణ భయము తొలగించితివా         ||నా యేసయ్యా||

3. మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు ||2||
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు ||2||
రారాజుగా దిగి వచ్చెదవు        ||నా యేసయ్యా||

 

Create Your Own Website With Webador