Naa Yesayya Naa sarvamu - నా యేసయ్య నా సర్వము
నా యేసయ్య నా సర్వము నీవేనయ్య ||2||
నశించిపోయే నన్ను వెదకి రక్షించితివి
నీ నామ ఘనతకే కృపలో నిలిపితివి ||2|| ||నా యేసయ్య||
1. అమరములో నిలిచి పొంగే కడలిని
మాటతో నిమ్మల పరచినావే ||2||
యే ధరి కానక తిరిగే నన్ను
నీ ధరి చేర్చి నన్నాదరించితివే ||2|| ||నా యేసయ్య||
2. నీవుండు చోటున నేనుండుటకు
లోకములోనుండి నను వేరు పరచితివి ||2||
అరణ్య మార్గమున నా కాపరివై
నా చెయ్యి విడువక నడిపించుచుంటివిగా ||2|| ||నా యేసయ్య||
3. నీ మందిరములో దాచిన మేలుతో
నా హృదయమును సంతృప్తి పరచితివి ||2||
యే ఆయుధమును వర్దిల్లనీయక
నలు దిశలా నాకు నెమ్మది నిచిత్తివి ||2|| ||నా యేసయ్య||
Create Your Own Website With Webador