Naa Raagamu Neeve Kada - నా రాగము నీవే కదా
నా రాగము నీవే కదా
నా గానము నీవే కదా ||2||
నా పాటకు పల్లవి నీవే కదా ||2||
నా ప్రతి పదములో నీ నామమును గూర్చి
స్తుతి గానమే పాడనా - నీకోసమే పాడనా
యేసయ్య నీకోసమే పాడనా
1. మాటలు రాని అకాశపక్షులకు
సరిగమలు నేర్పినది నీవేకదా
శృతి చేసితివి నా జీవితమును
పూర్ణ మనసుతో ఆరాధించుటకు
జీవింతునయ్యా నీ సాక్షిగా ఇలలో
నీ కృప తోడుండగా
2. నామది నిండిన రక్షణ ఆనందమే
అది అణువు అణువు నీ ప్రేమ నే పాడేనే
తంబుర సితార నాదముతో నీకృపను
గానము చేసెద సంతోష భరితుడనై
నా స్తోత్ర గీతమ ఆరాధ్యదైవమా
నా విజయ సంకేతమా..
3. ఎందరు ఉన్న ఒంటరివాడనని
నా జంటగా నీవు నిలిచావయ్యా
ఎవరు విడదియ్యా లేనంతగా నన్ను
నీ ప్రాణముతో పెనవేసుకొంటివి
నీ సిలువ దర్శనం అది మరపురానిది
నిత్యము ధ్యానించెద..
Create Your Own Website With Webador