Naa Priyudaa Yesayya - నా ప్రియుడా యెసయ్యా

నా ప్రియుడా యెసయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను  ||2||
నా ప్రియుడా…. ఆ ఆ అ అ

1. నీ చేతితోనే నను లేపినావు
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి ||2||
నీ చేతి నీడలో నను దాచుకొంటివి ||2|| ॥ నా ప్రియుడా ॥

2. నీ వాక్కులన్ని వాగ్దానములై
నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి ||2||
నీ వాగ్దానములు మార్పులేనివి ||2|| ॥ నా ప్రియుడా ॥

3. ముందెన్నడూ నేను వెళ్ళనీ
నూతనమైన మార్గములన్నిటిలో ||2||
నా తోడు నీవై నన్ను నడిపినావు ||2|| ॥ నా ప్రియుడా ॥

4. సర్వోన్నతుడా సర్వకృపానిధి
సర్వసంపదలు నీలోనే యున్నవి ||2||
నీవు నా పక్షమై నిలిచి యున్నావు ||2|| ॥ నా ప్రియుడా ॥

 

Create Your Own Website With Webador