Naa Korika Nee Pranalika - నాకోరిక నీ ప్రణాళిక

నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని

నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని ||2||

అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను

ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు ||2||

నా హృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే

నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా  ||నాకోరిక||

1. యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపి

గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు ||2||

నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున

దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా    ||నా హృదయంలో||

2. నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము

ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ||2||

ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు

దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా    ||నా హృదయంలో||

3. స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం

మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట ||2||

సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలో నాకున్న నిరీక్షణ

వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా     ||నా హృదయంలో||

Create Your Own Website With Webador