Naa Jeevam Nee Krupalo - నా జీవం నీ కృపలో

నా జీవం నీ కృపలో దాచితివే

నా జీవిత కాలమంతా

ప్రభువా నీవే నా ఆశ్రయం

నా ఆశ్రయం ||నా జీవం||

1. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు

నిత్య జీవమిచ్చితివే    ||2||

పావురము వలె నీ సన్నిధిలో

జీవింప పిలచితివే    ||2|| ||నా జీవం||

2. ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము

అడ్డురానే వచ్చెనే    ||2||

నీ బాహు బలమే నన్ను దాటించి

శత్రువునే కూల్చెనే    ||2|| ||నా జీవం||

3. కానాను యాత్రలో యొర్దాను అలలచే

కలత చెందితినే    ||2||

కాపరివైన నీవు దహించు అగ్నిగా

నా ముందు నడచితివే    ||2|| ||నా జీవం||

4. వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము

నన్ను వెంటాడెనే    ||2||

వాక్యమైయున్న నీ సహవాసము

ధైర్యము పుట్టించెనే    ||2|| ||నా జీవం||

 

5. స్తుతుల మధ్యలో నివసించువాడా

స్తుతికి పాత్రుడా    ||2||

స్తుతి యాగముగా నీ సేవలో

ప్రాణార్పణ చేతునే    ||2|| ||నా జీవం||