Naa Hrudayamulo nee maatale - నా హృదయములో నీ మాటలే

నా హృదయములో నీ మాటలే

నా కనులకు కాంతి రేఖలు ||2||

కారు చీకటిలో కలువరి కిరణమై

కఠిన హృదయమును కరిగించిన



నీ కార్యములను వివరింప తరమా

నీ ఘన కార్యములు వర్ణింప తరమా ||2||   ||నా హృదయములో||



1.
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు

మంచు వలె కృపను కురిపించితివి ||2||

విచారములు కొట్టి వేసి

విజయానందముతో నింపినావు

నీరు పారేటి తోటగా చేసి

సత్తువ గల భూమిగా మార్చినావు   ||నీ కార్యములను||

 

2. విరజిమ్మే ఉదయ కాంతిలో

నిరీక్షణ ధైర్యమును కలిగించి ||2||

అగ్ని శోధనలు జయించుటకు

మహిమాత్మతో నింపినావు

ఆర్పజాలని జ్వాలగా చేసి

దీప స్తంభముగా నను నిలిపినావు   ||నీ కార్యములను||

 

3. పవిత్రురాలైన కన్యకగా

పరిశుద్ధ జీవితము చేయుటకు ||2||

పావన రక్తముతో కడిగి

పరమానందముతో నింపినావు

సిద్ధపడుచున్న వధువుగా చేసి

సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు   ||నీ కార్యములను||

Create Your Own Website With Webador