Naa geethaaradhanalo - నా గీతారాధనలో

నా గీతారాధనలో యేసయ్యా

నీ కృప ఆధారమే

నా ఆవేదనలలో జనించెనే

నీ కృపాదారణ   ||2|| ||నా గీతా||

1. నీ కృప నాలో వ్యర్ధము కాలేదు

నీ కృపా వాక్యమే

చేదైన వేరు ఏదైన నాలో 

మొలవనివ్వలేదులే    ||2||

నీ కృప నాలో అత్యున్నతమై

నీతో నన్ను అంటు కట్టెనే    ||2|| ||నా గీతా||

2. చేనిలోని పైరు చేతికి రాకున్నా

ఫలములన్ని రాలిపోయినా

సిరి సంపదలన్ని దూరమై పోయినా

నేను చలించనులే    ||2||

నిశ్చలమైన రాజ్యము కొరకే

ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే    ||2|| ||నా గీతా||

3. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో

నిండుగా కుమ్మరించెనే

ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో

ఫలింపజేసెనే    ||2||

ఆత్మతో సత్యముతో ఆరాధించుచు

నే వేచియుందునే నీ రాకడకై    ||2|| ||నా గీతా||

Create Your Own Website With Webador