Naa arpanalu - నా అర్పణలు
నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2||
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2||
1. ఆధారణలేని ఈ లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2||
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే మేలాయెనే ||2|| || నా అర్పణలు ||
2. గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2||
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే ||2|| || నా అర్పణలు ||
3. మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2||
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2|| || నా అర్పణలు ||
Create Your Own Website With Webador