Melu Cheyaka Neevu - మేలు చేయక నీవు
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2||
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా ||2||
1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే ||2||
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా ||2||
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే ||2||
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ ||2||
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో ||2||
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ||2||
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Create Your Own Website With Webador